చిత్రసీమలో ఇప్పటికీ హీరోలదే హవా! ఎక్కువగా వారి పాత్రలకే పెద్దపీట వేస్తుంటారు దర్శకనిర్మాతలు. హీరోయిన్లకు అన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రాధాన్యం లభించకపోవచ్చు. ఈ విషయమై స్పందించమని కథానాయిక కియారా అడ్వాణీని అడగ్గా ఇలా సమాధానమిచ్చింది.
దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందే: కియారా - కియారా అడ్వాణీ పురుషాధిక్యం
సినీ ఇండస్ట్రీలో ఉన్న పురుషాధిక్యత గురించి మాట్లాడింది నటి కియారా అడ్వాణీ. కానీ ఈ విషయమై స్పందించేందుకు తనకే ఇబ్బందిగా ఉందని చెప్పింది.
![దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందే: కియారా actress kiara advani about male domination in society](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8684655-5-8684655-1599269099787.jpg)
హీరోయిన్ కియారా అడ్వాణీ
"ఈరోజుల్లో పురుషాధిక్యత గురించి మాట్లాడటానికి నాకే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఆడ, మగ అనే తేడా లేదు. ప్రతి రంగంలోనూ సమాన అవకాశాలు దొరుకుతున్నాయి. లేని చోట పోరాడి సాధించుకుంటున్నారు. అయితే ఈ పోరాట స్ఫూర్తి ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలి. ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ తమ బాధ్యతల్ని సమానంగా పంచుకోవాలి" అని చెప్పింది ముద్దుగుమ్మ కియారా.