దక్షిణాది సినీ పరిశ్రమలో, తమిళ రాజకీయ రణరంగంలో జయలలిత చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమె జీవితాధారంగా తలైవి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీలో జయలలితలా కనిపించడం కోసం చాలా కసరత్తులు చేస్తోందట కంగనా.
జయలలిత సినీ రంగంలో ఉన్నప్పుడు నాజూకుగా కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టాక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె బాగా లావైపోయింది. ఇప్పుడు తెరపై ఆమె పాత్రను పోషిస్తున్న కంగనా...ఆలాగే కనిపించేందుకు బరువు పెరగాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం తాను ఉన్న బరువుకు అదనంగా మరో 6కిలోలు పెరగాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఇందుకోసం తన డైట్‌ను పక్కకు పెట్టి మరీ అన్ని రకాల కొవ్వు పదార్థాలు, కొద్ది మోతాదులో ఫ్యాట్ గెయిన్ పిల్స్ తీసుకుంటోందని సమాచారం.