అమృతసర్‌లోని గోల్డెన్ టెంపుల్(Golden Temple)ను చూసి ఆశ్యర్యానికి గురయ్యానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) అన్నారు. తొలిసారి ఈ టెంపుల్‌ని దర్శించిన కంగన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు.
Kangana Ranaut: 'గోల్డెన్ టెంపుల్ చూసి ఆశ్చర్యపోయా' - కంగనా రనౌత్ గోల్డెన్ టెంపుల్
అమృతసర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఇక్కడికి రావడం ఇదే మొదటిసారని.. ఈ వాతారవరణం చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు.
కంగనా రనౌత్
"శ్రీ హర్‌మందిర్ సాహెబ్ గోల్డెన్ టెంపుల్‌ని ఈ రోజు దర్శించుకున్నాను. నా కుటుంబ సభ్యులంతా చాలా సార్లు ఈ మందిరానికి వచ్చారు. కానీ, నేను ఉత్తరాదిలోనే పెరిగినా ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. ఇదే తొలిసారి. గోల్డెన్ టెంపుల్ వాతావరణం చూసి ఆశ్యర్యపోయా. ఈ టెంపుల్ అందం, ఆధ్యాత్మికత గురించి మాటల్లో చెప్పలేం" అన్నారు కంగనా రనౌత్. సంబంధిత ఫొటోల్నీ షేర్ చేశారు.