వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇటీవలే వార్తల్లో నిలిచిన నటి కంగనా రనౌత్.. చెప్పినట్లు గానే ముంబయికి పయనమైంది. కొవిడ్ పరీక్షలు చేయించుకుని అందులో నెగిటివ్‌గా తేలింది. దీంతో చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానమెక్కనుంది. ముంబయికి చేరుకున్నాక తనను హోమ్ క్వారంటైన్లో ఉంచాలని మున్సిపల్ అధికారులు సిద్ధంగా ఉన్నారు.
బాలీవుడ్ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే ఎక్కువగా భయపడుతున్నానని ఈ మధ్యే కంగన చెప్పింది. దీంతో శివసేన నేత సంజయ్ రౌత్, ఆమెను ముంబయి రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. స్పందించిన కంగన.. ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ ట్వీట్ చేసింది. తద్వారా ఈ వివాదం మరింత వేడెక్కింది. ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే సమాచారంతో కంగనకు వై- ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం.