తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మేడమ్​ టుస్సాడ్స్​లో కాజల్​ మైనపు 'ప్రతిరూపం' - Madame Tussauds Singapore

దక్షిణాది ప్రముఖ నటి కాజల్ అగర్వాల్​కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్​లోని మేడమ్​ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఈ చందమామ​ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ఆమె చేతుల మీదుగానే ఆ బొమ్మను ఆవిష్కరించారు.

Kajal Aggarwals Wax Statue
మేడమ్​ టుస్సాడ్స్​లో కాజల్​ మైనపు ప్రతిరూపం

By

Published : Feb 5, 2020, 12:31 PM IST

Updated : Feb 29, 2020, 6:30 AM IST

అగ్రనటి కాజల్​ అగర్వాల్​ ప్రముఖుల సరసన చేరింది. తాజాగా ఈ అమ్మడు మైనపు విగ్రహాన్ని సింగపూర్​లోని మేడమ్​ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కుటుంబంతో కలిసి పాల్గొందీ అందాల భామ. తన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది కాజల్​. వాటిని నటి నిషా అగర్వాల్‌​ సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

మేడమ్​ టుస్సాడ్స్​లో కాజల్​ మైనపు ప్రతిరూపం
మైనపు బొమ్మ, ఒరిజినల్​ కాజల్​ మధ్యలో సోదరి నిషా అగర్వాల్​

ఈ మ్యూజియంలో భారతదేశానికి చెందిన ప్రభాస్, మహేశ్​బాబు, శ్రీదేవి, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్​ వంటి ప్రముఖ నటుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వారి పక్కన తను చోటు సంపాదించడంపై కాజల్ ఆనందం వ్యక్తం చేసింది.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్‌.. తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్రతారగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 12 ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె... కమల్​హాసన్ 'భారతీయుడు-2', మంచు విష్ణుతో 'మోసగాళ్లు' సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది.

Last Updated : Feb 29, 2020, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details