సినీ, రాజకీయ, క్రీడా రంగంలోని ప్రముఖలు మైనపు విగ్రహాలను సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం తెలిసిన సంగతే. గతంలో టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, మహేశ్‌బాబులకు ఈ అరుదైన గౌరవం దక్కింది.తాజాగా ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఈ జాబితాలో చేరింది.
కాజల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. 2020 ఫిబ్రవరి 5న హీరోయిన్ చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ అరుదైన అవకాశం అందుకున్న కాజల్.. ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది.
"టుస్సాడ్స్ మ్యూజియంలో నా విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 5న మీ అందరికి పరిచయం చేస్తా."