స్టార్ కథానాయిక కాజల్, తను ప్రేమించిన గౌతమ్ కిచ్లూను శుక్రవారం రాత్రి వివాహం చేసుకుంది. తన వివాహానికి సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్టాలో శనివారం పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తమ పెళ్లి జరిగిన తీరును వివరించింది.
పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్ - kajal marriage latest news
తన పెళ్లిలో జీలకర్రా బెల్లం కూడా ఉపయోగించామని చెప్పిన కాజల్.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోల్ని పంచుకుంది.
"పంజాబీ వచ్చి కశ్మీరీని వివాహం చేసుకుంది. అయితే ఇందులో మేము తెలుగు వివాహ సంప్రదాయమైన జీలకర్ర-బెల్లం కూడా తీసుకొచ్చి కలిపాం. ఎందుకంటే గౌతమ్‌కు, నాకు దక్షిణాదితో ఎంతో అనుబంధం ఉంది. తెలుగు వివాహాల్లో జీలకర్ర-బెల్లంకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ తంతుతోనే పెళ్లి కుమార్తె-కుమారుడు వివాహ బంధంతో ఒక్కటవుతారు. జీలకర్ర-బెల్లాన్ని కలిపి ముద్దలా చేసి తమలపాకుపై ఉంచి ముహూర్త సమయానికి వేద మంత్రాల నడుమ వధూవరులు ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు. ఆ తర్వాతే వధూవరులు ఒకరినొకరు చూసుకుంటారు. సుఖ దుఃఖాల్లో ఎప్పుడూ కలిసి ఉంటారని చెప్పే పవిత్ర వేడుక"అని జీలకర్ర-బెల్లం విశిష్టతను పంచుకుంది కాజల్.
'నా విశ్వాసపాత్రుడు, చెలికాడు, స్నేహితుడు, నా అంతరాత్మతో నా వివాహం జరిగింది. మిస్ కాజల్‌ను మిస్సెస్ కాజల్ అయ్యాను. ఇవన్నీ నీలో దొరకడం చాలా సంతోషంగా ఉంది కిచ్లూ' అని మరో ఫొటోను షేర్ చేసింది కాజల్.