ముద్దుగుమ్మ 'కాజల్' మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో శుక్రవారం రాత్రి ఆమె ఏడడుగులు వేసింది. అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. తన ప్రియసఖుడిని మనువాడే వేళ కాజల్ మోము పున్నమి 'చందమామ'లా వెలిగిపోయింది. వివాహ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఘనంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి - actress kajal agarwal news
హీరోయిన్ కాజల్ అగర్వాల్.. యువ వ్యాపారవేత్త గౌతమ్‌ను మనువాడింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
'లక్ష్మికల్యాణం'తో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్.. రెండో చిత్రం 'చందమామ'తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. తెలుగు అగ్రకథానాయికలతోపాటు యువ హీరోలతోనూ ఆమె ఆడిపాడింది. గ్లామర్ రోల్స్‌లో మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రలతో కాజల్ మెప్పించింది. మగధీరలోని 'మిత్రమింద', డార్లింగ్‌లోని 'నందిని', నేనేరాజు నేనే మంత్రిలోని 'రాధ' పాత్రలు ఆమెకు మరింత ప్రాముఖ్యతను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య', కమల్‌హాసన్‌తో 'ఇండియన్-2', మంచువిష్ణుతో 'మోసగాళ్లు' సినిమాల్లో నటిస్తుంది. అయితే వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ఆమె ఇప్పటికే చెప్పింది.