ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంలో కుటుంబసభ్యులు.. ముఖ్యంగా బంధువుల నుంచి తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని అలనాటి నటి ఆమని అన్నారు. అలాగే మరో నటి ఇంద్రజ కోర్టు కేసులో ఓ స్టార్ హీరో తన తరఫున వాదించడం గురించి వెల్లడించారు. వీరిద్దరూ ఈటీవీలో ప్రసారమవుతోన్న 'ఆలీతో సరదాగా' ప్రోగ్రామ్‌కు విచ్చేసి పలు విషయాలు పంచుకున్నారు.
ఇంద్రజ కోసం కోర్టులో కేసు వాదించి గెలిచిన స్టార్ హీరో ఎవరు? - ఆలీతో సరదాగా ఇంద్రజ
సీనియర్ నటి ఇంద్రజ.. కోర్టులో ఓ స్టార్ హీరో తన తరఫున వాదించడం గురించి తెలిపారు. ఈటీవీలో ప్రసారమవుతోన్న ఆలీతో సరదాగా షోలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇంద్రజ
ఐదేళ్ల వయసు నుంచే తనకు సినిమాలు అంటే ఇష్టమని.. స్కూల్‌లో చదవడం మానేసి శ్రీదేవి, జయప్రద, జయసుధల గురించే ఎక్కువగా ఆలోచించేదాన్ని అని ఆమని తెలిపారు. దొంగిలించిన మామిడికాయలు తినడమంటే తనకెంతో ఇష్టమన్నారు. అనంతరం తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. "సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాక.. మా కుటుంబానికి ఆ విషయం చెప్పాను. మా బంధువులందరూ విమర్శించారు. ‘అది సినిమాల్లో చేయడమేమిటి?ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదు, పెద్ద అందగత్తె ఏం కాదు" అని అన్నారని ఆమని తెలిపారు.