త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జల్సా' సినిమాతో సందడి చేసింది పవన్ కల్యాణ్, ఇలియానా జోడి. 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ వెండితెరపై నటించనున్నట్లు సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్.. రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'వకీల్‌సాబ్'. హిందీలో విజయవంతమైన 'పింక్' సినిమాకు ఇది తెలుగు రీమేక్.
ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం నాయికల ఎంపిక పూర్తవ్వగా.. పవన్ సరసన నటించే భామ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ నటిస్తుందని ఇటీవలే వార్తలొచ్చాయి. 'వకీల్ సాబ్'లో తాను నటించట్లేదని ఈ రూమర్లకు సమాధానం ఇచ్చింది శ్రుతి. ఇప్పుడు ఏ నాయిక పవర్‌స్టార్‌కు జోడీగా నటిస్తుంది? అనేది సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.