తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Himaja: నా గురించి ఏమిటా వీడియోలు?: నటి హిమజ - హిమజ పెళ్లి

Himaja: విడాకుల రూమర్స్‌పై నటి, బిగ్​బాస్ బ్యూటీ హిమజ స్పందించారు. తను రహస్యంగా పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం లాంటివి జరగలేదని అన్నారు. అలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నవారిపై మండిపడ్డారు.

Himaja
హిమజ

By

Published : Jan 28, 2022, 5:38 PM IST

Himaja: ధారావాహికలు, సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ.. ఇటీవలే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నవారిపై మండిపడ్డారు. వరుస యూట్యూబ్‌ వీడియోలతో నెటిజన్లను అలరిస్తోన్న హిమజ రహస్యంగా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. మనస్పర్థల కారణంగా ఇప్పుడు ఆమె విడాకులు తీసుకుంటోందని గురువారం పలు వార్తలు సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై ఆమె శుక్రవారం స్పందించారు. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు.

హిమజ

"నా సన్నిహితుల నుంచి ఇటీవలే కొన్ని యూట్యూబ్‌, న్యూస్‌ ఆర్టికల్స్‌ లింక్స్‌ వచ్చాయి. నేను ఎవర్నో పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నానని అందులోని సమాచారం. నాది ఒకటే రిక్వెస్ట్‌.. దయచేసి నా పెళ్లి, విడాకులకు నన్ను పిలవండి. యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. . విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇందేంటో నాకు అర్థం కావడం లేదు. నా గురించి ఎలాంటి ట్రోలింగ్స్‌ చేసినా నేను పట్టించుకోకపోవచ్చు. కానీ ఇంట్లో పెద్దవాళ్ల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్లు ఇలాంటి వార్తలు చూసి తట్టుకోలేరు. కాబట్టి ఇలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి."

-హిమజ, నటి

నన్నెవరూ ఇబ్బంది పెట్టలేదు..

"అంతేకాకుండా నాతో ఎవరో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని వీడియోలు సృష్టిస్తున్నారు. నిజం చెప్పాలంటే నన్ను ఎవరూ వేధించడం లేదు. మానసికంగా ఇబ్బందిపెట్టలేదు. నేను ఇబ్బంది పడను.. పెట్టను.. అసలు అలాంటి చోట నేను ఉండను." అని హిమజ తెలిపారు.

నటి హిమజ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు! సినీనటి క్షమాపణ!!

ABOUT THE AUTHOR

...view details