నల్గొండలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్షకు సినీ నటి, 'మా' ఉపాధ్యక్షురాలు హేమ హాజరయ్యారు. డిగ్రీలో ప్రవేశం పొందేందుకు నిర్దేశించిన విద్యార్హతలు లేని వారికి యూనివర్సిటీ, అర్హత పరీక్ష నిర్వహిస్తుంది.
డిగ్రీ అర్హత పరీక్షకు టాలీవుడ్ ప్రముఖ నటి
సీనియర్ నటి హేమ.. డిగ్రీ అర్హత ప్రవేశ పరీక్ష రాశారు. గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నానని ఇప్పుడు కుదిరిందని చెప్పారు.
డిగ్రీ అర్హత పరీక్షకు టాలీవుడ్ ప్రముఖ నటి హేమ
ప్రస్తుతం తాను రామోజీఫిల్మ్‌సిటీలో 'కొండాపురం' సినిమా చిత్రీకరణలో ఉన్నానని అందుకే పరీక్ష కేంద్రంగా నల్గొండ ఎంచుకొన్నట్లు హేమ చెప్పారు. గత రెండేళ్లుగా డిగ్రీ ప్రవేశం కోసం అర్హత పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తున్నా వీలు కాలేదని అన్నారు. డిగ్రీతోపాటు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోనున్నట్లు ఆమె తెలిపారు.