టాలీవుడ్లో 'రెడీ', 'ఢీ', 'బొమ్మరిల్లు' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి జెనీలియా.. ఇటీవలే 'అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం' సందర్భంగా అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తన భర్తతో పాటు అవయవాలను దానం చేస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాలో పంచుకుంది. తమకు ఈ విషయంలో స్ఫూర్తి కలిగించిన డాక్టర్ నోజెర్కు ధన్యవాదాలు తెలిపింది.
అవయవదానం చేసిన నటి జెనీలియా దంపతులు - actress Genelia news
జులై 1న డాక్టర్స్ డే సందర్భంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు జెనీలియా దంపతులు. తమ అవయవాల్ని దానం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు.
జెనీలియా రితేశ్ దేశ్ముఖ్
అయితే ఈ పోస్ట్ పెట్టిన తర్వాత నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. వీరితోపాటే పలువురు సెలబ్రిటీలు ఈ జంటను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులతో లాక్డౌన్ సమయాన్ని ఆస్వాదిస్తున్న జెనీలియా.. వెండితెరపైకి త్వరలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది.
ఇవీ చదవండి: