అశ్లీల చిత్రాల కేసులో ఈ ఏడాది ప్రారంభంలో అరెస్టయిన నటి గెహానా వశిష్ఠ్ తాజాగా ముంబయి పోలీసులపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.15 లక్షలు లంచంగా ఇవ్వాలని ముంబయి పోలీసులు తనను డిమాండ్ చేసినట్టు శనివారం ఆమె ఆరోపించింది. తాను ఏ తప్పూ చేయలేదని వారికి చెప్పినట్టు వివరించింది. కానీ ఏ కేసునైనా.. ఎవరికైనా వ్యతిరేకంగా మార్చగలమంటూ పోలీసులు తనను బెదిరించారని ఆరోపించింది. ఆ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులైన యశ్ ఠాకూర్ అలియాస్ అరవింద్ కుమార్ శ్రీవాస్తవ, తన్వీర్ హష్మీల మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఆమె ప్రస్తావించింది. పోలీసులు డబ్బు డిమాండ్ చేయడం వల్ల వారు రూ.8 లక్షలు సిద్ధం చేసుకుంటున్నట్లు అందులో ఉందని ఆమె పేర్కొంది. అశ్లీల చిత్రాల కేసులో పోలీసులు ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ఆ కేసుకు సంబంధించి సుమారు నాలుగు నెలలపాటు ఆమె జైలు జీవితం గడిపింది.
pornography case: రూ.15 లక్షలిస్తే అరెస్టు చేయనన్నారు! - porn rocket case
అశ్లీల చిత్రాల కేసులో ఈ ఏడాది అరెస్టయిన నటి గెహానా వశిష్ఠ్ ముంబయి పోలీసులపై సంచలన ఆరోపణలు చేసింది. రూ.15 లక్షలిస్తే తనను అరెస్టు చేయమని పోలీసులు అన్నారని ఆరోపించింది.
గెహానా వశిష్ఠ్
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన హాట్‌షాట్స్ యాప్ వ్యవహారంలో ఇటీవల నమోదు చేసిన అశ్లీల చిత్రాల కేసులోనూ మంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గెహానా వశిష్ఠ్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అమె రెండు.. మూడు అశ్లీల చిత్రాల్లో నటించిందంటూ అందులో పేర్కొన్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రాను పోలీసులు ఈ నెల 19న అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:పోర్న్ వీడియోల చిత్రీకరణ.. నటి అరెస్ట్!