తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్టీఆర్ పక్కన సీతగా.. ఎంజీఆర్ సోదరిగా - geetanjali

సీనియర్ నటి గీతాంజలి.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అంతకు ముందు జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో తన జీవితం, సినిమాలకు సంబంధించిన పలు విషయాల్ని పంచుకున్నారు.

సీనియర్ నటి గీతాంజలి

By

Published : Oct 31, 2019, 11:20 AM IST

Updated : Oct 31, 2019, 2:23 PM IST

సీనియర్ నటి గీతాంజలి.. తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు. అలనాటి అగ్రహీరో ఎన్టీఆర్​ పక్కన సీత పాత్ర పోషించే అవకాశం దక్కించుకున్నారు. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాతఅడపాదడపా సహాయ పాత్రల్లో కనిపించారు. బుధవారం రాత్రి హైదరాబాద్​లో గుండెపోటుతో మరణించారు. అంతకు ముందు జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

అసలు పేరు 'గీతాంజలి' కాదు

గీతాంజలి అసలు పేరు మణి. 1963లో 'పారస్‌మణి' అనే హిందీ సినిమాలో నటిస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్.. టైటిల్​లో మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని పేరు సూచించారు.

అలా ఎన్టీఆర్‌ పక్కన సీతగా..

సీతారామ కల్యాణం సినిమాలో సీతగా గీతాంజలి

"నన్ను ఇప్పటికీ చాలామంది ఎన్టీఆర్‌ సీత అనే పిలుస్తారు. ఆ గొప్పదనమంతా పెద్దాయనదే. హీరోయిన్‌గా తొలి సినిమా అది. నా మొదటి చిత్రం 'రాణీ రత్నప్రభ'లోని ఓ డ్యాన్స్‌ బిట్‌లో చూసిన రామారావుగారు.. 'అమ్మాయి బాగుంది. సీత పాత్రకు నప్పుతుంది' అని దర్శకుడు సుబ్బారావుకు చెప్పారు. అలా 'సీతారామ కల్యాణం'లో హీరోయిన్‌ అయిపోయా" -గీతాంజలి, సీనియర్ నటి

ఎంజీఆర్ చెల్లెలు పాత్రంటే గీతాంజలినే

"ఎంజీఆర్‌ చెల్లెలుగా చాలా సినిమాల్లో చేశాను. చెల్లెలు పాత్ర అనగానే 'గీతాంజలిని తీసుకోండి' అనేవారాయన. చాలా మంచి మనిషి. ఏదైనా సినిమా ఒప్పుకోకపోతే ‘నువ్వు నా చెల్లెలివేనా, నా పక్కన నటించవా’ అనేవారు" -గీతాంజలి, సీనియర్ నటి

నటి గీతాంజలి-ఆమె భర్త రామకృష్ణ

పెళ్లి తర్వాతే వంట నేర్చుకున్నా..

"నేనూ, రామకృష్ణగారు కలిసి చాలా సినిమాల్లో పనిచేశాం. 'పెళ్లిరోజు' సినిమా అప్పుడు మా పెళ్లి ప్రస్తావన వచ్చింది. మాది లవ్‌ మ్యారేజ్‌ కాదు. నాన్న కుదిర్చిన పెళ్లి. పెళ్లయ్యాక నా భర్త.. 'విశ్రాంతి తీసుకో' అనడం వల్ల గృహిణిగా సెటిలైపోయా. పెళ్లి తర్వాతే వంట నేర్చుకున్నా" -గీతాంజలి, సీనియర్ నటి

ఎన్టీఆర్‌ను తన సినీ గురువుగా గీతాంజలి చెప్పుకునేవారు. సీత పాత్ర వల్లే తెలుగులో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రతి ఇంటర్వ్యూలోనూ ఈమె వెల్లడించేవారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న 'దటీజ్‌ మహాలక్ష్మి'.

ఇది చదవండి: సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

Last Updated : Oct 31, 2019, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details