'దంగల్' సినిమాలో గీతా ఫొగాట్గా నటించిన ఫాతిమా సనా షేక్.. భయంకరమైన నిజాన్ని వెల్లడించింది. మూడేళ్ల వయసున్నప్పుడే తనను లైంగికంగా వేధించారని చెప్పింది. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీనితో పాటు పలు విషయాల్ని పంచుకుంది.
మూడేళ్లప్పుడే 'దంగల్' నటికి లైంగిక వేధింపులు - దంగల్ నటి ఫాతిమా లైంగిక వేధింపులు
క్యాస్టింగ్ కౌచ్ వల్ల తాను ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పిన నటి ఫాతిమా సనా షేక్.. మూడేళ్ల వయసులోనే తనను లైంగికంగా వేధించారని తెలిపింది.
'మూడేళ్ల వయసులో నన్ను లైంగికంగా వేధించారు. ఇలాంటి సమస్యల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మహిళలు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మారుతోంది. చదువుకోవడం వల్ల ఈ విషయాల గురించి తెలుస్తోంది. దీంతో బయటకు చెప్పుకోగలుగుతున్నారు. సినీ కెరీర్లో క్యాస్టింగ్ కౌచ్‌ను నేను ఎదుర్కొన్నాను. అవకాశాల కోసం వెళ్లినప్పుడు వారు అడిగింది ఇవ్వనందుకు వెనక్కు పంపించేసిన సందర్భాలు అనేకం' ఉన్నాయని ఫాతిమా చెప్పింది.
ప్రస్తుతం ఈమె 'లూడో', 'సూరజ్ పే మంగళ్ భారీ' సినిమాల్లో నటిస్తోంది. ఇవి రెండూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.