చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకున్న ఓ నటికి చేదు అనుభవం ఎదురయ్యింది. కథానాయికగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది కోలీవుడ్ నటి రైజా విల్సన్. ధనుష్ కథానాయకుడిగా నటించిన 'వి.ఐ.పి-2'తో నటిగా వెండితెరకు పరిచయమైన రైజా ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కాగా, తాజాగా ఆమె పెట్టిన ఓ ఫొటో ప్రతి ఒక్కర్నీ షాక్‌కు గురిచేసింది. ఆ ఫొటోలో రైజా కన్ను కింద కమిలిపోయినట్లు ఉంది. ఇటీవల తాను ఓ స్కిన్ కేర్ వైద్యురాలిని సంప్రదించినట్లు.. ఆమె ఇచ్చిన చికిత్స వల్లే తన చర్మం ఇలా మారినట్లు రైజా తెలిపారు.
ఇదీ చదవండి:మహిళా ఆటో డ్రైవర్‌కు కారు కొనిచ్చిన సమంత