వరుసగా తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నటి ఈషారెబ్బా. 'అంతకు ముందు.. ఆ తరువాత..', 'అ!', 'బ్రాండ్బాబు' సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ నటి గురించి ప్రస్తుతం నెట్టింట్లో మాట్లాడుకుంటున్నారు. తక్కువ పారితోషికం ఆఫర్ చేశారని ఈ చిన్నది ఓ భారీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె వదులుకున్న ఆ సినిమా ఏమిటంటే.. 'శాకుంతలం'.
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో! - సమంత వార్తలు
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం నటి ఈషా రెబ్బాను చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఆమెకు ఆ పాత్ర నచ్చినప్పటికీ.. పారితోషకం తక్కువగా ఉండడం వల్ల ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న అపురూప ప్రేమకావ్యం 'శాకుంతలం'. సమంత ప్రధానపాత్రలో నటించనున్న ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. అయితే, త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం చిత్రబృందం ఈషారెబ్బాని సంప్రదించిందట. అయితే, పాత్ర నచ్చినప్పటికీ.. పారితోషికం తక్కువగా ఉండటం వల్ల ఆమె సున్నితంగా తిరస్కరించారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చూడండి:షూటింగ్లో ప్రమాదం.. హీరో నిఖిల్‌కు గాయాలు!