బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీశ్ పటానీకి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ విద్యుత్‌శాఖ విజిలెన్స్ విభాగంలో పనిచేసే ఇద్దరు అధికారులకు పాజిటివ్‌గా తేలిందని అదనపు సీఎంఓ అశోక్ కుమార్ చెప్పారు. జగదీశ్ పటానీతో పాటు అతని సహ ఉద్యోగులు ఇద్దరు ఇటీవలే లక్నో నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చారని.. వారికి వైద్యపరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తెలిసిందని అశోక్ తెలిపారు.
హీరోయిన్ దిశా పటానీ తండ్రికి కరోనా - Disha Patani latest news
కథానాయిక దిశా పటానీ తండ్రి జగదీశ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు సహ ఉద్యోగుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ విద్యుత్‌శాఖ అదనపు సీఎంఓ అశోక్ కుమార్ వెల్లడించారు.

బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రికి కరోనా పాజిటివ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగంలో డిప్యూటీ ఎస్పీగా పనిచేస్తున్న జగదీశ్ పటానీ, అతని బృందం ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ కుంభకోణం విషయమై దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వారికి కరోనా సోకడం వల్ల జోనల్ ఛీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని 48 గంటలపాటు మూసేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Last Updated : Aug 6, 2020, 1:54 PM IST