కరోనా నియంత్రణలో భాగంగా స్వీయ నిర్బంధంలో ఉన్న సినీతారలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధాన్ని పాటిస్తోన్న బాలీవుడ్ నటి దిశా పటానీ.. ఇన్‌స్టాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది.
అల్లుఅర్జున్, దిశా పటానీ ఇన్స్టాగ్రామ్ సంభాషణలు ఎలా చేశారు..!
అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాట ఫ్లోర్ స్టెప్ ఎలా వేయగలిగారని.. ఇన్‌స్టా వేదికగా దిశా పటానీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దానికి స్పందించిన బన్నీ.. "నాకు సంగీతమంటే ఇష్టం. అలాంటి సంగీతం వింటే నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. మీ ప్రశంసకు ధన్యవాదాలు" అని సమాధానమిచ్చాడు స్టైలిష్ స్టార్. అల్లు అర్జున్ స్పందనకు బదులుగా "మమ్మల్ని ప్రేరేపించినందుకు ధన్యవాదాలు" అని రిప్లే ఇచ్చిందీ అందాల తార.
దిశా పటానీ.. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ సరసన 'రాధే' చిత్రంలో నటిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు ఏక్తా కపూర్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న 'ఏక్ విలన్ 2' సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఇదీ చూడండి..'లింగ వివక్షలేని సమాజాన్ని త్వరలోనే చూస్తాం'