లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇన్‌స్టాలో నవ్వుతెప్పించే ఓ వీడియోను తాజాగా షేర్ చేసింది. 'నాకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండాలని అనుకుంటున్నా. కానీ దేవుడు.. నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇస్తే ఏం చేయాలి? వారిలో ఎవరిని తిరస్కరించాలి' అంటూ ఇందులో చెప్పుకొచ్చింది.
'నలుగురు భాయ్ఫ్రెండ్స్లో ఎవరిని తిరస్కరించాలి' - దిశా పటానీ తాజా వార్తలు
హాస్యభరిత వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన దిశా పటానీ.. దేవుడు తనకు ఒకరు కంటే ఎక్కువ భాయ్‌ఫ్రెండ్స్ ఇస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తోంది.
దిశా పటానీ
'మీరు కచ్చితంగా అందరని మెప్పించగలరు. ఏం ఇబ్బంది లేదు. అందరిని ఒకేలా చూసుకోండి' అని ఓ నెటిజన్ చెప్పగా, 'ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే టైగర్ ష్రాఫ్‌ను సంప్రదిస్తే సరిపోతుందని' మరొకరు కామెంట్ పెట్టారు.
ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో 'రాధే' సినిమాలో దిశా హీరోయిన్గా నటిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. మే 22న విడుదల కావాల్సినా ఈ చిత్రం... కరోనా కారణంగా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. దీనితో పాటే ఏక్తా కపూర్ నిర్మిస్తున్న 'కెటీనా'లోనూ నటిస్తోందీ భామ.
Last Updated : May 7, 2020, 7:47 AM IST