బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొణె నవ్వుకు ఏథెన్స్ ఫిదా అయ్యింది. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఓ ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన నవ్వు గల ప్రముఖుల విగ్రహాలను అందులో ప్రదర్శనకు ఉంచారు. అయితే.. బాలీవుడ్ నటి దీపిక పదుకొణెకు అందులో చోటు లభించింది. ఆమె విగ్రహాన్ని కూడా విమానాశ్రయంలోని ఎగ్జిబిషన్‌లో ఉంచారు. ఈ విషయాన్ని దీపిక అభిమానులు సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక నవ్వుకు ఏథెన్స్ ఫిదా
స్టార్ కథానాయిక దీపికా పదుకొణె నవ్వుకు ఏథెన్స్ ఫిదా అయ్యింది. గ్రీస్‌లోని ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వచ్ఛమైన నవ్వుతో ఉన్న ప్రముఖుల విగ్రహాలను ఇటీవలే ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌లో హీరోయిన్ దీపికకు చోటు లభించిందని అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు.
అయితే.. ఇందుకు సంబంధించి ఆమె మాత్రం ఇప్పటి వరకూ స్పందించకపోవడం గమనార్హం. అయితే.. తన వివాహ రిసెప్షన్‌లో దీపిక ధరించిన నెక్లెస్, చీర ఆ విగ్రహంపై ఉండటం.. పైగా ఆ బొమ్మ కింది భాగంగా 'బాలీవుడ్ నటి' అని పేర్కొనడం సహా అచ్చుగుద్దినట్లుగా దీపిక పోలీకలు ఉండటం వల్ల అది కచ్చితంగా దీపిక పదుకొణె విగ్రహమేనని అభిమానులు భావిస్తున్నారు.
2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ను పరిణయమాడిన తర్వాత దీపిక సినిమాలు తగ్గించింది. మేఘనా గుల్జర్ దర్శకత్వంలో వచ్చిన 'ఛపాక్' చిత్రంలో యాసిడ్ బాధితురాలిగా దీపిక కనిపించింది. ప్రస్తుతం తన భర్త రణ్‌వీర్‌తో కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా '83' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్‌దేవ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.