నటి విద్యుల్లేఖ రామన్ త్వరలోనే పెళ్లి కూతురుగా దర్శనమివ్వబోతున్నారు. తమిళ, తెలుగు చిత్రాల్లో తన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. గతకొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ అయిన సంజయ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోవఇరు కుటుంబాల అంగీకారంతో వీరు ఒక్కటి కాబోతున్నారు. సంజయ్‌తో రోకా వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.
"మేం రోకా చేసుకున్నాం. ఆగస్టు 26న ఈ వేడుక జరిగింది. అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు. మేమందరం మాస్క్‌లు ధరించి, ఫొటోల కోసం వాటిని తీసి, మళ్లీ వేసుకున్నాం. మాకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లందరికీ ధన్యవాదాలు" అని విద్యుల్లేఖ పేర్కొన్నారు.