ప్రముఖ నటి చిత్ర(56) మృతి చెందారు. 'నల్లెనై చిత్ర'గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గుండెపోటుతో చెన్నైలో శనివారం తుదిశ్వాస విడిచారు. దక్షిణాదిలో తెలుగు, కన్నడ, మలయాళ, తమిళంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి, అభిమానులకు దగ్గరయ్యారు. చిత్ర మృతిపై పలువురు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
గుండెపోటుతో నటి చిత్ర ఆకస్మిక మరణం - తెలుగు మూవీ న్యూస్
దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న నటి చిత్ర గుండెపోటుతో మరణించారు. ఈమె మృతిపట్ల పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.
నటి చిత్ర
తెలుగులో 'అమవాస్య చంద్రుడు', 'గాజు బొమ్మలు', 'పదహారేళ్ల అమ్మాయి', 'నేటి స్వాతంత్ర్యం', 'ఇంద్రధనస్సు', 'ప్రేమించాక' తదితర సినిమాల్లో చిత్ర నటించారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 21, 2021, 9:22 AM IST