ఇటీవల హైదరాబాద్‌లో పోటెత్తిన వరదల కారణంగా తన తల్లిదండ్రులు కరోనా వైరస్ బారినపడ్డట్లు ప్రముఖ కథానాయిక, నిర్మాత చార్మి చెప్పింది. మార్చి నుంచి లాక్డౌన్లో ఇంట్లోనే చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ వరదల వల్ల వారికి వైరస్ సోకిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడినట్లు వెల్లడించింది.
నటి చార్మి తల్లిదండ్రులకు కరోనా
నటి, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న చార్మి తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.
నటి చార్మి తల్లిదండ్రులకు కరోనా
అక్టోబర్ 22న తన తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు చార్మి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.