తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియుడ్ని పరిచయం చేసిన హీరోయిన్ అవికా గోర్

సంతోషంగా ఉంచేందుకు తన జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడని హీరోయిన్ అవికా గోర్ చెప్పింది​. ఈ క్రమంలోనే తన ప్రియుడి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

actress avika gor introduced her boyfriend in social media
'ఈ ఇడియట్‌ నా హృదయాన్ని కదిలించాడు'

By

Published : Nov 12, 2020, 10:12 AM IST

బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్‌.. తన ప్రియుడ్ని పరిచయం చేసింది. మిలింద్‌ చద్వానీతో ప్రేమలో ఉన్నానని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేసింది. తన ప్రార్థనలకు మిలింద్​ రూపంలో సమాధానం దొరికిందని తెలిపింది.

ప్రియుడు మిలింద్​తో అవికా గోర్​

"నా ప్రార్థనలకు సమాధానం లభించింది. నా లైఫ్‌లో లవ్‌ దొరికింది. మనల్ని అర్థం చేసుకుని.. నమ్మి.. స్ఫూర్తినింపి.. మన అభివృద్ధిలో సాయం చేసి.. మనల్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి మనం అర్హులం. కానీ అలాంటి వ్యక్తి దొరకడం అసాధ్యమని చాలా మంది అనుకుంటారు. కాబట్టి నాకు ఇదంతా కలలా ఉంది. కానీ జరుగుతున్నది నిజమే, నిజమే... మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తా. ఇవాళ నేను ఎలా ఫీల్‌ అవుతున్నానో.. అదే భావన మీరూ పొందాలని ఆశిస్తున్నా"

--అవికా గోర్​, హీరోయిన్​

ప్రియుడితో అవికా గోర్​

'నాకు ఈ అనుభూతిని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ బంధం నా జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించబోతోంది. ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం మాకు లేదు. నన్ను సంతోషంగా ఉంచేందుకు నా జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు, అది నాకు ఎంతో అందమైన అనుభవంలా అనిపిస్తోంది. ఈ ఇడియట్‌ నా హృదయాన్ని కదిలించాడని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు థాంక్స్‌ మిలింద్‌ చద్వానీ. హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నా..’ అని ఆమె ఫొటోలు షేర్‌ చేసింది.

అవికా గోర్​

అవికా బాలనటిగా కెరీర్‌ ఆరంభించింది. పలు టీవీ సీరియళ్లతోపాటు సినిమాల్లోనూ నటించింది. 'ఉయ్యాలా జంపాలా'తో హీరోయిన్​గా వెండితెరకు పరిచయమైంది. 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజుగారి గది 3' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది.

గత కొన్నేళ్లుగా బొద్దుగా ఉన్న ఈమె.. నాజూకుగా మారి, అభిమానుల్ని ఇటీవలే సర్‌ప్రైజ్‌ చేసింది. ఏడాది క్రితం తన శరీరాకృతి వల్ల ఎంతో బాధపడ్డానని, అందుకే వర్కౌట్లు చేసి సన్నగా మారారని తెలిపింది.

ఇదీ చూడండి:'రానా.. నీకు పెళ్లైనా ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా!'

ABOUT THE AUTHOR

...view details