Anupama parameswaran: 'అ ఆ'తో తెలుగు తెరకు పరిచయమై... వరుస అవకాశాలు అందుకుంటూ... సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకున్న మలయాళ నటి అనుపమా పరమేశ్వరన్. త్వరలో 'కార్తికేయ 2', 'హెలెన్', '18 పేజెస్' సినిమాలతో మళ్లీ తెలుగు అభిమానుల్ని పలకరించబోతున్న అను... తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా...
మొదటి అవకాశం అప్పుడే
నేను మొదటిసారి మలయాళ 'ప్రేమమ్'లో మేరీ జార్జ్ పాత్రలో నటించాననేది అందరికీ తెలిసిందే. నిజానికి అప్పుడు నాకు పందొమ్మిదేళ్లంతే. కొట్టాయంలోని సీఎంఎస్ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లిష్‌లో డిగ్రీ చేస్తున్నా. సినిమా అవకాశం గురించి తెలియడం వల్ల ప్రయత్నిద్దామని ఆడిషన్‌కు వెళ్తే... అవకాశం ఇచ్చారు. అది పూర్తయ్యాక మరికొన్ని సినిమాలు రావడంతో చదువును ఆపేయాల్సి వచ్చింది. ఆ అవకాశాల్లో భాగంగానే తెలుగులో మొదటిసారి 'అ ఆ'లో నటించా. తరువాత డిగ్రీని పూర్తిచేశాననుకోండీ.
జంతు ప్రేమికురాలిని
నాకు చిన్నప్పటినుంచీ కుక్కలంటే చాలా ఇష్టం. మా ఇంట్లోనూ మూడు కుక్కపిల్లలు ఉండేవి. కొన్నిరోజుల క్రితం పార్వోవైరస్ కారణంగా రెండు చనిపోయాయి. ఆ బాధ నుంచి కోలుకున్నాక పార్వో వైరస్ గురించి జంతు ప్రేమికులకు సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించడం మొదలుపెట్టా.
సహాయ దర్శకురాలిగానూ..
మొదటి సినిమా తరువాత ఇదే నా కెరీర్ అనుకుని నన్ను నేను ఎప్పటికప్పుడు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అయితే కొన్నాళ్లక్రితం మలయాళంలో ‘మనియరయిలే అశోకన్’ అనే సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసే అవకాశం వచ్చింది. నిజానికి ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ నిర్మాత. అందులో నేను నటించా కూడా. అయితే.. దుల్కర్ ఓసారి సరదాగా ‘సహాయ దర్శకురాలిగానూ ట్రై చేయొచ్చు కదా’ అనడంతో ప్రయత్నించా. ఇప్పుడు నాకు అందులోనూ ప్రావీణ్యం వచ్చేసింది.
ఇష్టపడే ఆహారం
మా కేరళ సాద్య. నేను ఎక్కువగా పోషకాహారానికే ప్రాధాన్యం ఇస్తా కానీ.. చీట్ మీల్ రోజున మాత్రం పిజా, చాక్లెట్, ఐస్‌క్రీమ్ వంటివి ఇష్టంగా లాగించేస్తుంటా.
ఫొటోలు మార్చారు...