లాక్‌డౌన్ పూర్తయ్యి ఎప్పుడు సెట్‌లో అడుగుపెడతానా అనే ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది నటి అనుపమ పరమేశ్వరన్. చేసే పనిని ప్రేమించడమే తనకి తెలిసినదని.. దాంతో రోజూ సంతోషంగా గడపవచ్చు అంటోంది.
మీరెప్పుడూ సంతోషంగా కనిపిస్తుంటారు. దాని వెనకున్న రహస్యమేంటి?
అనుపమ పరమేశ్వరన్:నా పనిని నేను ప్రేమించడమే ఆ రహస్యం. చిన్నప్పటి నుంచి నటిని కావాలని కలగన్నా. దాన్ని నెరవేర్చుకున్నా. అందుకే నాకిష్టమైన ఈ నటనని ఎంతో ఆస్వాదిస్తున్నా. అదే సంతోషాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తుంటుంది. సెట్‌లో ఓ సన్నివేశాన్ని పూర్తి చేశాక.. అది నేననుకున్న దానికన్నా బాగా వస్తే మనసు ఖుషీ అవుతుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. మీరు నమ్ముతారో లేదో.. పని పట్ల ఎక్కువ సంతృప్తి పొందిన రోజు రాత్రంతా సరిగా నిద్ర కూడా పట్టదు. ఇప్పుడీ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కు దూరమైనందుకు చాలా బాధగానే ఉంది. కానీ, మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పదు కదా. నేనైతే ఎప్పుడెప్పుడు మళ్లీ సెట్స్‌లోకి అడుగు పెడతానా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.
ఇదీ చూడండి.. వలస కూలీలను ఇంటికి చేర్చిన మంచు మనోజ్