తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Happy Birthday Anjali: వెంటపడి మరీ రాఖీ కట్టా - అంజలి కెరీర్

'షాపింగ్​ మాల్​' చిత్రం కోసం నిజమైన సేల్స్​గర్ల్​ అవతారమెత్తినట్లు హీరోయిన్ అంజలి చెప్పింది. సన్నివేశాలు రియాలిస్టిక్​గా రావడం కోసం దాదాపు వారం రోజులపాటు ఇలానే తనపై చిత్రీకరణ (Anjali)జరిపినట్లు వెల్లడించింది. నేడు (జూన్ 16) అంజలి పుట్టినరోజు సందర్భంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో ఆమె పంచుకున్న అభిప్రాయాలు మీకోసం.

anjali
అంజలి

By

Published : Jun 16, 2021, 5:32 AM IST

Updated : Jun 16, 2021, 6:12 AM IST

'ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే..!' అనే ఒక్క డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో 'సీత'గా సుస్థిరస్థానం సంపాదించుకుంది అంజలి(Anjali). ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులకు ఈమె మాత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో 'సీత'గానే గుర్తుండిపోతుంది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు(Anjali Birthday). ఈ క్రమంలో గతంలో ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అంజలి పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం.

అంజలి

వెంటపడుతున్నాడని రాఖీ కట్టింది

అంజలి అసలు పేరు బాలా త్రిపుర సుందరి. అది తన నానమ్మ పేరు అని.. కానీ, ఆ పేరుతో ఎవరు పిలవరు అని చెప్పింది. తన నానమ్మ ముద్దుపేరు బేబి కావడం వల్ల తనను బేబి అని పిలిచేవారని తెలిపింది. కాలేజీ రోజుల్లో తన వెంటపడిన అబ్బాయికి రాఖీ కట్టినట్లు వెల్లడించింది.

సేల్స్​గర్ల్​గా

అంజలి హీరోయిన్​గా చేసిన తొలి చిత్రం 'షాపింగ్​మాల్'.​ దీని షూటింగ్​ కోసం సేల్స్​గర్ల్​గా పనిచేసినట్లు ఆమె తెలిపింది. "ఓ షాప్‌లో పనిచేసే సేల్స్‌గర్ల్-సేల్స్​బాయ్‌ మధ్య జరిగే ప్రేమ కథే ఈ సినిమా. దాని కోసం ఓ సెట్‌ వేశారు. అందులో 80 రోజులు షూటింగ్‌ చేశాం. కొనసాగింపుగా రంగనాథ స్ట్రీట్‌లో చిత్రీకరించాల్సి వచ్చింది. దీంతో దర్శకుడు నాకు కొన్ని వస్తువులు ఇచ్చి జనాల్లో కలిసిపోయి అమ్ముకుని రమ్మన్నారు. అప్పటికి నేను కేవలం ఒక్క సినిమాలోనే నటించి ఉండటం వల్ల ఎవరూ గుర్తుపట్టలేదు. దాంతో నేను ఆ వస్తువులను అమ్మాను. సినిమాలోని సన్నివేశాలు రియలస్టిక్​ ఉండటం కోసమే అలా చేశారు. దాదాపు వారం రోజులు పాటు ఇలాగే నాపై సీన్స్ తీశారు" అని అలీతో అంజలి చెప్పింది.

ఇవీ చూడండి: ఇన్​స్టాపురములో విరిసిన అపరంజి బొమ్మలు!

Last Updated : Jun 16, 2021, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details