అంజలి... మాట, నటన అన్నీ సహజంగానే ఉంటాయి. కెరీర్‌లో ఎత్తుపల్లాలున్నా ఎప్పటికప్పుడు నటనతో మెప్పిస్తున్న ఈ తెలుగింటి ఆడపడుచు తన మనసులోని ముచ్చట్లను వివరించిందిలా..
నటి కాకపోయి ఉంటే...
ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే చిన్నప్పటినుంచీ నా కల సినిమారంగంలోకి రావడమే. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు టీచర్ మమ్మల్ని పెద్దయ్యాక ఏమవుతారని అడిగారు. అందరూ ఇంజినీర్, డాక్టర్ అంటూ ఏవేవో చెబుతుంటే నేను మాత్రం హీరోయిన్ అవుతానని అన్నానట.
ప్రేమలేఖలు...
చిన్నప్పటినుంచీ ఇప్పటి దాకా వస్తూనే ఉన్నాయి. తొమ్మిది లేదా పదో తరగతిలో అనుకుంటా... మా స్కూల్లో ఓ అబ్బాయి నా వెంట పడేవాడు. ఒకరోజు నా చేతికి ప్రేమలేఖ ఇచ్చాడు. నేనేమో మర్నాడు అతడి చేతికి రాఖీ కట్టా. అతడేమో.. రాఖీ కట్టినంత మాత్రాన అన్నయ్యను కానూ అంటూ దాన్ని పడేసి వెళ్లిపోయాడు.
మర్చిపోలేని జ్ఞాపకం...
ఓసారి స్కూల్‌ఫంక్షన్‌లో డ్యాన్స్ చేశా. అయితే ఇంట్లో తెలిస్తే తిడతారని భయపడి సాయంత్రం వరకూ ఇంటికి వెళ్లకుండా పెరట్లోనే దాక్కున్నా. చివరకు పెద్దవాళ్లు వెతికి అలా చెప్పకుండా వెళ్లిపోకూడదని మందలించారు.
అదే నా బలం...
వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సమస్యలు ఎదురైనా అన్నింటినీ పాజిటివ్‌గానే తీసుకుంటా. ఏది జరగాలో అదే జరుగుతుంది కాబట్టి అంతా నా మంచికే అనుకుంటా.
నటనంటే...
మనలానే నటించాలని అనుకుంటా. లేదంటే ఆ పాత్రకు న్యాయం చేయలేమని అనిపిస్తుంది. 'సీతమ్మ వాకిట్లో...' సినిమాలో ఇదే జరిగింది. మొదటి రెండుమూడు రోజులు సీతలా చేయలేక చాలా కంగారు పడిపోయా. ఆ తరువాత బాగా ఆలోచించి.. డైలాగుల్ని నేనెలా చెప్తానో అలాగే చెప్పడం మొదలుపెట్టేసరికి ధైర్యం వచ్చింది.
ఇష్టపడే హీరోయిన్లు...