వి.స్టూడియోస్ పతాకంపై రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ నటించిన చిత్రం 'ఆడై'. దుస్తులు అనే అర్థమొచ్చే పేరు అది. థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్తాజాగా విడుదలైంది. ఈ తమిళ చిత్రంలో అమలాపాల్ ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా నటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ మంగళవారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
'ఆడై'లో నగ్నంగా నటించిన అమలాపాల్ - ఆడైలో అమలాపాల్, కరణ్‌జోహర్
సాహసోపేతమైన పాత్రలు చేయడంలో ముందుండే కథానాయిక అమలాపాల్. తొలినాళ్లలోనే తన పంథా ఏమిటో నటనతో చాటి చెప్పింది. పాత్రల్లో సహజంగా ఒదిగిపోయి ఎంతో పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన 'ఆడై' చిత్రం మరోసారి అమలాపాల్ గురించి చర్చ లేవనెత్తింది.
'ఆడై'లో నగ్నంగా నటించిన అమలాపాల్
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. అమలాపాల్‌కి తమిళం, మలయాళంలోనే కాకుండా, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
నటి నుంచి నిర్మాతగా అవతారమెత్తి 'కడవర్' అనే చిత్రం చేస్తుంది అమలా. ఇందులో ఫోరెన్సిక్ సర్జన్ పాత్రలో నటిస్తోంది. తమిళంలో 'అదో అంద పరవై పోల అడై', మలయాళంలో 'ఆడు జీవితం' సినిమాలతో బిజీగా ఉంది.