జీవితంలో సంతోషం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుందని చెప్పింది నటి అమలాపాల్. ఈ విషయాన్నే చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. "సంతోషం ఒక్కోసారి ఒక్కో లా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏకాంతం, మరి కొన్నిసార్లు అదిరిపోయే చిరునవ్వు. మనకు మనమే ఏదైనా సంతోషాన్ని సృష్టించుకోవాలి. ఆదివారం రాత్రి చంద్రకాంతిలో సాంగ్రియా గోబ్లెట్ లా అన్నమాట" అంటూ అమలాపాల్ రాసుకొచ్చింది.
ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది: అమలాపాల్ - అమలాపాల్ వార్తలు
సంతోషం గురించి చెప్పిన అమలాపాల్.. ఈ విషయం ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈ భామ.. 'లస్ట్' అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.
నటి అమలాపాల్
మలయాళ సినిమా 'నీలతామర'తో నటిగా పరిచయమైన అమలాపాల్.. 'మైనా'(తెలుగులో 'ప్రేమఖైదీ')తో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తెలుగులో 'బెజవాడ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' పాటు పలు సినిమాల్లో నటించింది. గతేడాది 'అడై'(తెలుగులో 'ఆమె')తో మెప్పించిన ఈ భామ.. మలయాళంలో ప్రస్తుతం 'అదుజీవితం'లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సరసన నటిస్తోంది. దీనితో పాటే 'లస్ట్' వెబ్‌సిరీస్‌లో కీలకపాత్ర పోషిస్తోంది.