అలనాటి హిందీ నటుడు కబీర్ బేడీ మనవరాలు ఆలయ ఎఫ్.. ఇటీవలే వచ్చిన 'జవానీ జానేమన్' సినిమాతో తెరంగేట్రం చేసింది. లాక్‌డౌన్ వల్ల ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న ఈమె.. తనలోని సృజనాత్మకతకు మెరుగులు పెడతున్నట్లు చెప్పింది. నిన్న(బుధవారం) ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూమి ఫొటోలను స్కెచ్ వేసి, వాటిని ఇన్స్టాలో పంచుకుంది.
"ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఊరికే కాలక్షేపానికి వదిలేయకుండా ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. నా వరకు యోగాతో పాటు ఆరోగ్య జాగ్రత్తల గురించి తెలుసుకుంటున్నా. చదవడం, సినిమాలు చూడటం, ఆన్‌లైన్ తరగతుల్లో పాల్గొనడం చేస్తున్నా. మనలో దాగున్న శక్తులను, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగిస్తున్నా. ముఖ్యంగా ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ మిగతా సాప్ట్‌వేర్‌ల గురించి తెలుసుకుంటున్నా" -ఆలయ ఎఫ్, బాలీవుడ్ హీరోయిన్