తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటి ఇంట్లో చోరీ.. గొంతుపై కత్తిపెట్టి! - alankrita sahai actresses

ఓ యువ నటి ఇంట్లోకి దొంగల ముఠా దూరి చోరీకి పాల్పడింది. ఆమె గొంతుపై కత్తి పెట్టి బెదిరించి.. రూ.6లక్షల నగదును దోచుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

alankrita
అలంకృత సాహై

By

Published : Sep 8, 2021, 12:44 PM IST

బాలీవుడ్ యువ​ నటి అలంకృత సాహై ఇంట్లోకి దొంగల ముఠా దూరి కలకలం సృష్టించింది. ఆమె గొంతుపై కత్తి పెట్టి, ఆరు లక్షల నగదును దోచుకెళ్లింది. విషయం తెలిసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అలంకృత సాహై

ఇదీ జరిగింది!

నెల రోజుల క్రితం అలంకృత ఆ ఇంట్లోకి అద్దెకు దిగింది. ఆమె తల్లిదండ్రులు పద్దెనిమిది రోజుల క్రితం దిల్లీకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం 2.40గంటల సమయంలో అలంకృత ఇంట్లోకి ముగ్గురు దొంగలు దూరి చోరీకి పాల్పడినట్లు ఫోన్ రాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిందంతా ఆమెను అడిగి తెలుసుకోగా ఈ విషయాన్ని చెప్పింది. సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అలంకృత 2018లో 'లవ్​పర్​ స్క్వేర్​ ఫూట్'​, 'నమస్తే ఇంగ్లాండ్​' సినిమాల్లో నటించింది. పలు మ్యూజిక్​ ఆల్బమ్స్​లోనూ మెరిసింది.

ఇదీ చూడండి: శంకర్​-చెర్రీ సినిమా మొదలు.. చిరు, రణ్​వీర్​ సందడి

ABOUT THE AUTHOR

...view details