తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తన రెండో పెళ్లి అలా జరగాలంట..! - అదితిరావు హైదరి, సినీ నటి

ప్రముఖ నటి అదితిరావు హైదరి తన రెండో పెళ్లి గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది. సముద్రం దగ్గరున్న పురాతన హవేలీలో వివాహం చేసుకోవాలని ఉందని తన కోరికని బయటపెట్టింది.

హీరోయిన్​ అదితిరావ్​కి రెండోపెళ్లి అలా జరగాలంట..!

By

Published : Oct 13, 2019, 10:10 AM IST

పెళ్లి విషయాల్లో యువత చాలా కలలు కంటారు. అందుకే ఓ సినీకవి... "ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునేలా ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి" అని వివాహాన్ని గొప్పగా వర్ణించాడు. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నటి అదితిరావు... పెళ్లిపై తన అభిప్రాయాల్ని పంచుకుంది.

నటి అదితిరావ్​ హైదరి

ఇదివరకే సత్యదీప్​ మిశ్ర అనే బాలీవుడ్​ నటుడిని వివాహమాడిందీ అమ్మడు. వ్యక్తిగత కారణాలతో 2013లో ఇద్దరూ విడిపోయారు. తాజాగా మళ్లీ వివాహం గురించి మాట్లాడిందీ భామ. పెళ్లికి రవివర్మ పెయింటింగ్‌లో అమ్మాయిలా తయారై... సముద్రం దగ్గరున్న పురాతన హవేలీలో వివాహం చేసుకోవాలని ఉందని చెప్పుకొచ్చింది.

మాజీ భర్త సత్యదీప్​ మిశ్రతో అదితి

" పెళ్లికి రవివర్మ పెయింటింగ్‌లా రెడీ కావాలని ఉంది. ఆ రంగుల్లోని దుస్తుల్ని ధరించాలని ఉంది. నాకు క్లాసిక్‌గా ఉండటమే ఇష్టం. సముద్రం వద్ద ఉన్న అత్యంత పురాతన హవేలీలో వివాహం చేసుకోవాలని ఉంది. హవేలీలో పెళ్లి పనులు, హడావుడి పూర్తయిన తర్వాత నా చెప్పులు తీసేసి.. ఆనందంగా అలా సముద్రం వద్దకు పరిగెడతా. ఆ రోజు మొత్తం చిందేస్తూ ఉంటా. నా ఆలోచనలు కొందరికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ నాకు ఓ గదిలో బంధించినట్లు ఉండటం నచ్చదు. అలా ఉండటం నా వల్ల కాదు"
-- అదితిరావు హైదరి, సినీ నటి

ఆమె తల్లి ఇషాన్​ హైదరి సహాజ సౌందర్యం పైనే మక్కువ చూపించేదని ఓ ఆసక్తికర విషయం పంచుకుంది అదితి.

తన తల్లి ఇషాన్​లా తయారై ఫోజులిచ్చిన అదితి

" మా అమ్మ తన పెళ్లికి చాలా సింపుల్‌గా ఉంది. ఆమె ముఖానికి కాస్త కూడా మేకప్‌ లేదు. కొంచెం మస్కరా మాత్రం వేసుకుందంతే. మెరిసే చర్మంపై మస్కరా వేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అమ్మ పెళ్లికి కేవలం మతాపట్టి (పాపిడి బిల్లలాంటిది) ఆభరణాన్ని మాత్రమే ధరించారు. ఆమె చీర కూడా చాలా సింపుల్‌గా ఉంది"
--అదితిరావు హైదరి, సినీ నటి

అనంతరం 'విష్‌ లిస్ట్‌' గురించి ప్రశ్నించగా.. ఇంట్లో సమయం గడపడం, సెలవులు, నచ్చిన పని చేయడం అని చెప్పిందీ అందాల భామ. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ ప్రాజెక్టులతో అదితి బిజీగా ఉంది. ప్రస్తుతం 'సైకో', 'వీ', 'తుగ్లక్​ దర్బార్'​,'సుఫియమ్​ సుజాతయమ్​' అనే చిత్రాల్లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details