తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకటి కాదు.. అంతకుమించిన చిత్రాలతో సిద్ధం!

లాక్​డౌన్​ కారణంగా గతేడాది అనేక చిత్రాల విడుదలలు నిలిచిపోయాయి. ఇటీవలే థియేటర్లలో వంద శాతం సీటింగ్​కు కేంద్రం ఆదేశాలివ్వడం వల్ల ఆ సినిమాలు రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గత చిత్రాలతో పాటు తారలు ప్రస్తుతం నటిస్తున్న కొన్ని చిత్రాలు ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ విధంగా ఒకే ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ చిత్రాలతో ప్రేక్షకులను అలరించనున్న నటీనటులెవరో తెలుసుకుందామా.!

Actors who will have more than one film release this year
ఒకటి కాదు.. అంతకు మించిన చిత్రాలతో సిద్ధం!

By

Published : Feb 11, 2021, 11:53 AM IST

Updated : Mar 19, 2021, 12:02 PM IST

దేశంలోని సినిమా హాళ్లలో వందశాతం సీటింగ్​కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. అయితే థియేటర్లలో కొవిడ్​ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. దాదాపుగా గతేడాది మొత్తం కరోనా కారణంగా తుడిచిపెట్టుకుపోవడం వల్ల కొంతమంది కథానాయకులు నటించిన కొన్ని చిత్రాల విడుదలలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వాటితో పాటు, వారు నటిస్తున్న కొత్త సినిమాలూ రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువ చిత్రాలతో వెండితెరపై ప్రేక్షకులను మెప్పించబోతున్న నటీనటులెవరో తెలుసుకుందాం.

అక్షయ్​ కుమార్​

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్​ కుమార్ విషయానికొస్తే కరోనా సంక్షోభం అతడి జోరుకు బ్రేక్​ వేయలేకపోయిందనే చెప్పాలి. లాక్​డౌన్​ తర్వాత చిత్రీకరణలో అడుగుపెట్టిన తొలి కథానాయకుడు అక్షయ్​ కావడం గమనార్హం.

అక్షయ్​ కుమార్​

గతేడాది ఆగస్టు నెలలో 'బెల్​ బాటమ్'​ సినిమా కోసం విదేశాలకు వెళ్లిన అక్షయ్​ కుమార్​.. ఆ షూటింగ్​ను దాదాపుగా పూర్తి చేసుకుని వచ్చారు. ఇందులో వాణీ కపూర్​ కథానాయిక. ఈ చిత్రం ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే రోహిత్​ శెట్టి దర్శకత్వంలో రూపొందిన 'సూర్యవంశీ' చిత్రం కూడా విడుదలకు సిద్ధమైంది. అక్షయ్​.. ప్రస్తుతం 'అత్రాంగి రే', 'పృథ్వీరాజ్​', 'బచ్చన్​ పాండే' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఆలియా భట్​

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంతో తెలుగుతెరపై ఆలియా భట్​ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో రామ్​చరణ్​కు జోడీగా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 13న విడుదల కానుంది.

అలియా భట్​

ఈ సినిమాతో పాటు బాలీవుడ్​ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తోన్న 'గంగూబాయ్​ కతియావాడి' చిత్రం కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాయి పల్లవి

సాయిపల్లవి

సౌత్​ ఇండియన్​ స్టార్​ హీరోయిన్​ సాయిపల్లవి.. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె హీరోయిన్​గా నాగచైతన్య జంటగా రూపొందుతోన్న 'లవ్​స్టోరీ' చిత్రం ఏప్రిల్​లో విడుదల కానుంది. దీంతో పాటు రానా ప్రధానపాత్రలో తెరకెక్కిన 'విరాట పర్వం' ఏప్రిల్​ 30న రిలీజ్​ కానుంది.

రణ్​వీర్​ సింగ్​

1983లో జరిగిన క్రికెట్​ ప్రపంచకప్​ నేపథ్యంలో టీమ్​ఇండియా కెప్టెన్​ కపిల్​దేవ్​ జీవితాధారంగా రూపొందిన '83' చిత్రంలో బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్​ ప్రధానపాత్ర పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చిలో విడుదల కావాల్సింది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

రణ్​వీర్​ సింగ్​

రణ్​వీర్​ సింగ్​ అతిథిపాత్రలో నటించిన 'సూర్యవంశీ' విడుదలకు సిద్ధమవ్వగా.. ఆయన హీరోగా రూపొందుతోన్న 'జయేష్​బాయ్​ జోర్దార్​' అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్​ సేతుపతి

కోలీవుడ్​ విలక్షణ నటుడు విజయ్​ సేతుపతి నటిస్తోన్న అనేక చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయన విలన్​గా చేసిన 'మాస్టర్​' సినిమా ఇటీవలే విడుదలైంది. తెలుగులో నటించిన 'ఉప్పెన' చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్​ సేతుపతి

దీంతో పాటు విజయ్​ సేతుపతి ప్రధానపాత్రలో నటిస్తోన్న 'కుట్టీ స్టోరీ', 'లాభం', 'కాతు వక్కుల రెండు కాదల్​' వంటి సినిమాలు ఇదే ఏడాది విడుదల కానున్నాయి.

ఇదీ చూడండి:సినిమాలే కాదు దైవభక్తీ ముఖ్యమే!

చిన్నప్పుడే హీరోయిన్​గా ఎంపికై.. ప్రేక్షకులకు దగ్గరై

టేకింగ్​లో, యాక్టింగ్​లో ఈ దర్శకులు కింగ్​లే!

Last Updated : Mar 19, 2021, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details