విభిన్న పాత్రలు పోషించి విలక్షణ నటులుగా గుర్తింపు పొందాలని ప్రతి నటుడికి ఉంటుంది. అయితే కొన్ని పాత్రలు వారి ఇమేజ్ను తగ్గించొచ్చు. అభిమానం కరవైపోవచ్చు. అలాంటిదే ట్రాన్స్‌జెండర్ పాత్ర. ఇంతటి రిస్క్ ఉన్నా కూడా కొంతమంది ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ట్రాన్స్‌జెండర్ పాత్రలు పోషించిన బాలీవుడ్ నటులెవరు? ఏ సినిమాల్లో వీరు నటించారు? వంటి విషయాలు తెలుసుకుందాం.
అక్షయ్‌కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్.. ఇటీవల 'లక్ష్మీబాంబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో అక్షయ్.. ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన 'కాంచన' సినిమా రీమేక్.
శరద్ కల్కర్
'లక్ష్మీబాంబ్' సినిమాలోనే ఫ్లాష్‌బ్యాక్‌లో సీనియర్ నటుడు శరద్ కల్కర్ కూడా థర్డ్‌జెండర్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించారు.
పరేష్ రావల్
1997లో విడుదలైన 'తమన్నా' సినిమా.. అప్పట్లో విజయం సాధించింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు పరేష్ రావల్ పోషించిన టిక్కు(ట్రాన్స్‌జెండర్) పాత్ర విమర్శకులు ప్రశంసలు పొందింది.
అషుతోష్ రానా