బాలీవుడ్ నటుడు సంచయ్ గోస్వామి వాట్సాప్ హ్యాకింగ్‌కు గురైంది. ఈమేరకు గుర్తుతెలియని వ్యక్తిపై ముంబయిలోని గోరేగావ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సంచయ్. వాట్సాప్ ద్వారా తన నెంబర్ నుంచి స్నేహితులు, బంధువులకు అసభ్య సందేశాలు, కాల్స్ వెళ్లాయని వెల్లడించాడు.
"నేను సోమవారం వేకువజామున ముంబయి విమానాశ్రయం నుంచి వస్తుండగా ఆరు అంకెల ఓటీపీ వచ్చింది. కానీ, నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత అంతర్జాతీయ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అమెరికాలో ఉన్న నా తమ్ముడు ఫోన్ చేసి ఉంటాడని భావించి కాల్ లిఫ్ట్ చేశాను. అందులో ఆరు అంకెల ఓటీపీ జెనరేట్ చేయమని అడిగింది. తక్షణమే కాల్ కట్ చేశాను. వెంట వెంటనే అధిక సంఖ్యలో కోడ్స్ రాగా.. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది."