తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాయిధరమ్​ తేజ్​ను పరామర్శించిన సినీప్రముఖులు - సాయిధరమ్​ తేజ్​ ఎన్టీఆర్​

రోడ్డు ప్రమాదానికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగాహీరో సాయి ధరమ్​ తేజ్​ను(sai dharam tej accident) సినీప్రముఖులు పరామర్శిస్తున్నారు. సామాజిక మాధ్యామాల వేదికగా తేజ్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వీరిలో ఎన్టీఆర్​, ప్రకాశ్​రాజ్​, శ్రీకాంత్​ తదితరులు ఉన్నారు.

sai
సాయి ధరమ్​ తేజ్​

By

Published : Sep 11, 2021, 12:25 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు సాయి ధరమ్​ తేజ్​ను(sai dharam tej accident)) పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.

మెగాస్టార్​ చిరంజీవి దంపతులు, పవన్​కల్యాణ్​, నటుడు రామ్ చరణ్, ఉపాసన కామినేని, నిహారిక సహా పలువురు మెగా కుటుంబ సభ్యులు సాయి తేజ్​ను పరామర్శించారు. నటి రాశిఖన్నా అపోలోకి వచ్చి సాయి తేజ్ కుటుంబసభ్యులను కలిశారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కూడా ఆస్పత్రికి వచ్చారు. అనంతరం మాట్లాడిన ప్రకాష్ రాజ్.. 'సాయి తేజ్ ఫైటర్.. అతడు త్వరగా కొలుకుంటాడు' అని పేర్కొన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'సాయి ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని అన్నారు. 'త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను బ్రదర్'​ అని తారక్​ ట్వీట్​ చేశారు.

కాసేపటి క్రితం అపోలో ఆస్పత్రి.. తేజ హెల్త్​ బులెటిన్​ను విడుదల చేసింది. 'సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం' అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి:సాయిధరమ్​ తేజ్​ హెల్త్ ​బులెటిన్​ విడుదల​

ABOUT THE AUTHOR

...view details