తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సైరా' యోధులు ఎలా సన్నద్ధమయ్యారో చూశారా..! - making videos

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో అమితాబ్​ బచ్చన్, విజయ్​ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా, నయతార లాంటి భారీ తారాగణం నటించింది. ఈ చిత్రం కోసం వారు ఎలా సన్నద్ధమయ్యారో ఈ మేకింగ్ వీడియోల్లో చూడండి.

సైరా నరసింహారెడ్డి

By

Published : Oct 2, 2019, 7:01 AM IST

Updated : Oct 2, 2019, 8:21 PM IST

సైరా నరసింహారెడ్డి.. ఈ సినిమా విడుదలకు కొద్ది సేపు మాత్రమే ఉంది. ఇందుకోసం మెగా అభిమాని నుంచి సగటు ప్రేక్షకుడి వరకు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్​ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణం నటించింది. మరి సైరా కోసం వీరు ఎలా సిద్ధమయ్యారో ఇప్పుడు చూద్దాం!

ఉయ్యలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్​ బచ్చన్​ నటించారు.

నరసింహారెడ్డితో కలిసి ఆంగ్లేయుల మీద యుద్ధం చేసే వ్యక్తి(వీరారెడ్డి పాత్రలో) జగపతిబాబు దర్శనమివ్వనున్నాడు.

నరసింహారెడ్డి(చిరంజీవి)కి సాయం చేసే తమిళరాజు రాజపండిగా కనిపించనున్నాడు విజయ్​సేతుపతి.

అహం భావంతో కూడిన అవుకురాజు పాత్రలో కిచ్చా సుదీప్​ నటించాడు.

సినిమాలోని కీలకమైన బసిరెడ్డి పాత్రలో రవికిషన్ కనిపించనున్నాడు.

నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మ పాత్రలో నయనతార కనిపించనుంది.

నృత్యకళాకారిణి లక్ష్మి పాత్రలో దర్శనమివ్వబోతోంది తమన్నా. నరసింహారెడ్డిని ఆరాధించే అమ్మాయి పాత్ర

కొణిదెల ప్రొడక్షన్స్​ బ్యానర్​పై రామ్​చరణ్​ నిర్మించిన ఈ చిత్రాన్ని సురేందర్​ రెడ్డి దర్శకత్వం వహించాడు. అమిత్​ త్రివేధి సంగీతం సమకూర్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: మిస్టర్​ పర్​ఫెక్ట్​ నుంచి నన్ను తప్పించారు : రకుల్​

Last Updated : Oct 2, 2019, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details