తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమాల్లో హిట్​​.. ఎన్నికల్లో ఫట్..​ - jayapraa

2019 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసిన కొంతమంది సినీ ప్రముఖులు పరాజయం పాలయ్యారు. శతృఘ్న సిన్హా, జయప్రద, రాజ్​బబ్బర్​ తదితరులు ఓడిపోయారు.

సినీనటులు

By

Published : May 24, 2019, 5:50 AM IST

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సినీప్రముఖులు కొంత మంది విజయ ఢంకా మోగించారు. సుమలత, సన్నీదేఓల్, హేమమాలిని గెలుపొందగా.. మరికొంతమంది పరాజయం పాలయ్యారు. లోక్​సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ప్రముఖుల గురించి ఇప్పుడు చూద్దాం.

శతృఘ్న సిన్హా...

భాజపా నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన శతృఘ్న సిన్హా పట్నాసాహిబ్ స్థానం​ నుంచి లోక్​సభకు పోటీ చేశారు. అయితే భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్​ చేతిలో పరాజయం చెందారు.

నిఖిల్​కుమార స్వామి గౌడ..

కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడైన నిఖిల్ కుమారస్వామి గౌడ స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్​ చేతిలో ఓడిపోయాడు. జేడీఎస్​ పార్టీ తరపున మండ్య నుంచి లోక్​సభకు పోటీ చేశాడు నిఖిల్.

ఊర్మిళా మాతోండ్కర్​...

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలీవుడ్ నటి ఊర్మిళా మాతోండ్కర్​​ ఉత్తర ముంబయి నుంచి పోటీచేశారు. భాజపా అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు.

జయప్రద..

సమాజ్​వాది పార్టీ నుంచి భాజపాలో చేరిన జయప్రద ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్​ రామ్​పుర్ నుంచి పోటీ చేసిన ఈమె సమాజ్​వాది పార్టీ అభ్యర్థి ఆజం ఖాన్​ చేతిలో పరాజయం చెందారు.

రాజ్​బబ్బర్​...

ప్రముఖ నటుడు రాజ్​బబ్బర్ భాజపా అభ్యర్థి రాజ్​కుమార్ చాహర్​ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఫతేపూర్​సిక్రీ నుంచి పోటీ చేశారు.

ప్రియా దత్​..

బాలీవుడ్ నటుడు సంజయ్​ దత్​ సోదరి ప్రియా సునిల్ దత్​ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్​ తరపున ముంబయి నార్త్​ సెంట్రల్ నుంచి పోటీ చేసిన ప్రియా భాజపా అభ్యర్ధి పూనమ్ మహాజన్ చేతిలో ఓడారు.

ABOUT THE AUTHOR

...view details