ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతితో జాత్యాహంకార దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని ప్రజలంతా రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలోనే వారి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చారు.
ఓ నల్లని అర చేయి నోటిని నొక్కుతున్నట్లుగా ఉన్న ఓ చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది తమన్నా. "ఇది కేవలం నల్ల జాతీయుల జీవితాలకు సంబంధించిందే కాదు.. అందరికి సంబంధించిన అంశం" అంటూ 'ఆల్ లైఫ్స్ మ్యాటర్' పేరుతో ట్వీట్ చేసింది. "మీ నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు" అని తెలిపింది.
"అమెరికా సహా ప్రపంచంలో జరిగే ఈ జాత్యహంకార దుశ్చర్యలకు ముగింపు పలకాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. దీనికోసం మనం చాలా చేయాలి. మనల్ని మనం విద్యావంతులుగా రూపుదిద్దుకోవాలి. కేవలం చర్మ రంగు కారణంగా వేరొకరి చేతిలో ఎందుకు బలైపోవాలి?"