హీరోయిన్ యామీ గౌతమ్.. బాలీవుడ్ యువ దర్శకుడు ఆదిత్య ధర్‌ను పెళ్లాడింది. ఇరుకుటుంబాలు మాత్రమే హాజరైన ఈ వేడుక శుక్రవారం జరిగింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించి, వివాహానికి సంబంధించిన ఫొటో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
Yami gautham: స్టార్ దర్శకుడితో హీరోయిన్ యామీ పెళ్లి - యామీ గౌతమ్ ఆదిత్య ధర్
తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు ఆదిత్య ధర్‌తో శుక్రవారం ఏడడుగులు వేసింది.
యామీ గౌతమ్
యామీ, ఆదిత్య.. 2019లో వచ్చిన 'ఉరి' సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే స్నేహం చిగురించి, అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా యామీ గౌతమ్ పలు సినిమాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుత అభిషేక్ బచ్చన్‌తో కలిసి 'దస్వీ' చేస్తోంది.
ఇది చదవండి:Pranitha Marriage :పెళ్లి పీటలెక్కిన ప్రణీత
Last Updated : Jun 4, 2021, 8:18 PM IST