తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2020, 6:11 PM IST

Updated : Apr 14, 2020, 6:21 PM IST

ETV Bharat / sitara

సీతాపహరణం చూస్తూ 'రావణాసురుడు' భావోద్వేగం

దూరదర్శన్​లో మళ్లీ ప్రసారమవుతున్న 'రామాయణ్' సీరియల్ చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు రావణుడు పాత్ర పోషించిన అరవింద్ త్రివేది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

సీతాపహరణం చూస్తూ 'రావణాసురుడు' భావోద్వేగం
రామాయణం చూస్తున్న రావణాసురుడి పాత్రధారి

కరోనా వల్ల ఇంటికే పరిమితమైన ప్రజలు, సెలబ్రిటీల కోరిక మేరకు అపురూప టీవీ సీరియల్స్ 'రామాయణం', 'మహాభారతం'​ను మళ్లీ దూరదర్శన్​లో ప్రసారం చేస్తున్నారు. ఇప్పటికే రేటింగ్స్, వ్యూస్​ పరంగా కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి ఈ ధారావాహికలు. 'రామాయణం'లోని రావణుడు పాత్రధారి అరవింద్ త్రివేది.. తాజాగా సీతాపహరణం ఎపిసోడ్​ను చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఈ వీడియోలో 84 ఏళ్ల త్రివేది, సీతను రావణుడు అపహరించే దృశ్యాలు ఆసక్తికరంగా వీక్షించారు. ఆ సన్నివేశం క్లైమాక్స్​ చూస్తూ తన రెండు చేతులు జోడించారు.

1987లో వచ్చిన 'రామాయణ్'ను రామానంద్​ సాగర్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఇందులో రాముడిగా అరుణ్ గోవలి, సీతగా దీపికా చిఖిలా, లక్ష్మణుడి పాత్రలో సునీల్ లహరి నటించారు.

రావణుడు పాత్రధారిగా అరవింద్ త్రివేది
Last Updated : Apr 14, 2020, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details