తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పునీత్​ ఇంటికి విశాల్​.. స్ఫూర్తినింపేలా 'అర్జున ఫల్గుణ' గీతం - పునీత్​ రాజ్​కుమార్​ విశాల్​

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. శ్రీవిష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ' సినిమాలోని సాంగ్​ విడుదలై ఆకట్టుకుంటోంది. 'ఆర్​ఆర్​ఆర్'​లోని 'నాటు నాటు' పాటకు డ్యాన్స్​ ఎలా వేయాలో చేసి చూపించారు కొరియోగ్రాఫర్​ ప్రేమరక్షిత్​. కాగా, గుండెపోటుతో మరణించిన కన్నడ స్టార్​ పునీత్ రాజ్​కుమార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు తమిళ హీరో విశాల్​.

cinema
సినిమా అప్డేట్స్​

By

Published : Nov 17, 2021, 9:07 PM IST

'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' సాంగ్​లో రామ్​చరణ్, ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్​ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. చాలా మంది రీల్స్​ చేసి సోషల్​మీడియాలో షేర్​ చేస్తున్నారు. దీంతో ఈ సాంగ్​కు డ్యాన్స్​ చేయాలనుకునేవారి కోసం కొరియోగ్రాఫర్​ ప్రేమ​ రక్షిత్​ ఓ వీడియోను పోస్ట్​ చేశారు. ఈ వీడియోతో నాటు నాటు స్టెప్పులు ప్రాక్టీస్​ చేయొచ్చు. 'నాటు నాటు' పాటకు ప్రేమరక్షిత్ కొరియోగ్రాఫీ చేయగా, కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్​గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ సినిమా.

అర్జున ఫల్గుణ పాట రిలీజ్​..
శ్రీవిష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృతా అయ్యర్‌ నాయిక. తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కాపాడేవా రాపాడేవా’ అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించగా ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ స్వరాలు సమకూర్చారు. మోహన భోగరాజు ఆలపించారు. కథానాయకుడి పాత్రకు ప్రతికూల పరిస్థితులు ఎదురైన సమయంలో వచ్చే గీతమనిపిస్తోంది. సమస్యలకు తలవంచకుండా అనుకున్నది సాధించాలనే స్ఫూర్తినిస్తోంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘గోదారోళ్లే’ సాంగ్, టీజర్‌కు విశేష స్పందన లభించింది. నరేష్‌, శివాజీరాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్‌, రంగస్థలం మహేష్‌, రాజ్‌కుమార్‌ చౌదరి, చైతన్య తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

పునీత్ ఇంటికి విశాల్​..

గుండెపోటుతో ఇటీవలే మరణించిన కన్నడ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ ఇంటికి హీరో విశాల్​ వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. పునీత్​ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

విశాల్​, పునీత్​ అన్నయ్య శివరాజ్​కుమార్​
విశాల్​

ఇదీ చూడండి: 'ఆయనెప్పుడూ జీవించే ఉంటారు'.. పునీత్​ భార్య భావోద్వేగపు లేఖ

ABOUT THE AUTHOR

...view details