"యాక్షన్‌తో నిండిన మంచి సందేశాత్మక చిత్రం 'ఎనిమీ'(enemy movie). ఈ దీపావళికి ప్రేక్షకులకు పర్‌ఫెక్ట్ గిఫ్ట్‌లా ఉంటుంది" అన్నారు కథానాయకుడు విశాల్(vishal actor new movie). ఆయన మరో హీరో ఆర్యతో కలిసి నటించిన చిత్రం 'ఎనిమీ'. ఆనంద్ శంకర్ తెరకెక్కించారు. వినోద్ కుమార్ నిర్మాత. మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ కథానాయికలు. ఈ సినిమా నేడు (నవంబర్ 4) థియేటర్లలో విడులవుతోంది(enemy release date). ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలు విలేకర్లతో పంచుకున్నారు విశాల్.
ఆ సన్నివేశాలు మా సినిమాకు హైలైట్: విశాల్ - విశాల్ ఎనిమీ రివ్యూ
విశాల్(vishal actor new movie), ఆర్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎనిమీ'(enemy release date). ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు (నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది(enemy release date). ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలు విలేకర్లతో పంచుకున్నారు విశాల్.
"దర్శకుడు ఆనంద్ ఈ కథ చెప్పినప్పుడు.. నేను హీరోగా వినలేదు. ఓ ప్రేక్షకుడిలా కథ విన్నా. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. వెంటనే చేస్తానని చెప్పా. మరో హీరో పాత్ర కోసం ఆర్య పేరును సూచించా. అయితే ముందుగా అతని పాత్ర నిడివిని ఇంకాస్త పెంచమని చెప్పా. ఆనంద్ అలాగే స్క్రిప్ట్‌లో మార్పులు చేసి.. ఆర్యకు కథ వినిపించాడు. తనకీ స్క్రిప్ట్ నచ్చడం వల్ల సినిమా పట్టాలెక్కించాం."
"సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అన్నది చిత్ర కథాంశం. సినిమాలో యాక్షన్‌తో పాటు సంభాషణలు శక్తిమంతంగానే ఉంటాయి. నిజానికి ఇందులో ఫైట్స్ కంటే మైండ్ గేమ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆఖర్లో మిత్రులిద్దరూ ఒక్కటయ్యాక సినిమా మరో స్థాయిలో ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అది సింగపూర్‌లోని 56 అంతస్థుల బిల్డింగ్‌పై జరిగినట్లు హైఎండ్ గ్రాఫిక్స్‌తో చేశాం. తెరపై దీన్ని చూస్తున్నంత సేపూ ఓ అంతర్జాతీయ సినిమా చూసినట్లే ఫీలవుతారు ప్రేక్షకులు."