తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఓటీటీ నుంచి ఆఫర్​ వచ్చినా.. థియేటర్​కే మా ఓటు' - మాస్టర్ సినిమా విడుదల తేదీ

తమిళ కథానాయకుడు విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మాస్టర్'. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ద్వారానే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా స్పష్టత నిచ్చింది చిత్రబృందం.

tamil actor vijay news
'ఓటీటీలో ప్రసక్తే లేదు.. పక్కా థియేటర్​లోనే'

By

Published : Nov 28, 2020, 7:39 PM IST

కోలీవుడ్​ స్టార్​ హీరో విజయ్​ నటించిన తాజా చిత్రం 'మాస్టర్​'. ఈ సినిమా ఓటీటీ వేదికగానే విడుదలకాననుందని కోలీవుడ్​ వర్గాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం, ఇప్పట్లో తెరచుకునే వీలు లేకపోయినా కచ్చితంగా వెండితైరపైనే సినిమా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఆఫర్​ వచ్చినా.. తిరస్కరించామని స్పష్టం చేసింది.

మాస్టర్ చిత్రబృందం ప్రకటన

'ఖైదీ'తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి కానుకగా విడుదలైన టీజర్​​.. ఇటీవలే 4 కోట్ల వీక్షణలను అందుకుంది. ఇందులో విజయ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, సిమ్రన్‌, ఆండ్రియా, శ్రీనాథ్‌, సంజీవ్‌ గౌరీ కిషన్‌, వీజే రమ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ABOUT THE AUTHOR

...view details