తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో విజయ్​ను ప్రశ్నించిన ఐటీ అధికారులు - AGS Cinemas

'బిగిల్​' సినిమా విషయంలో పన్ను ఎగవేతకు పాల్పడిన ఏజీఎస్ సినిమాస్ నిర్మాణ సంస్థతో హీరో విజయ్​కు సంబంధమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఐటీ అధికారులు అతడిని ప్రశ్నించారు.

హీరో విజయ్​ను ప్రశ్నించిన ఐటీ అధికారులు
హీరో విజయ్

By

Published : Feb 5, 2020, 5:10 PM IST

Updated : Feb 29, 2020, 7:05 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్​ను.. ఈరోజు(బుధవారం) ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రశ్నించారు. నెయివెలి, కడలూర్​లో 'మాస్టర్​' చిత్రీకరణ జరుగుతుండగా ఇది జరిగింది. విజయ్ గత సినిమా 'బిగిల్'(తెలుగులో 'విజిల్') విషయంలో పన్ను ఎగవేసిన నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్​తో ఈ కథానాయకుడికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అతడిని ఆరా తీశారు.

'మాస్టర్'లో హీరోగా నటిస్తున్నాడు విజయ్. మరో కీలక పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. 'ఖైదీ' ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

మాస్టర్ సినిమాలో విజయ్ లుక్
Last Updated : Feb 29, 2020, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details