తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరోహీరోయిన్లు ఎవరంటే? - విజయ్ దేవరకొండ లేటెస్ట్ న్యూస్

సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే నటుల్లో విజయ్‌ దేవరకొండ ముందుంటాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ లైగర్‌ హీరో.. ఇష్టాయిష్టాలనూ చెప్పేస్తున్నాడిలా!

actor vijay devarakonda
విజయ్ దేవరకొండ

By

Published : Jan 23, 2022, 9:58 AM IST

యువకథానాయకుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. ప్రస్తుతం 'లైగర్' చిత్రంలో నటిస్తున్న విజయ్.. ఇష్టాయిష్టాలు ఏంటో మీరూ తెలుసుకోండి..

తనే నా సూపర్‌ హీరో

.

నేను ఇష్టపడే మొదటి వ్యక్తి.. ఇంకెవరూ మా అమ్మే. నా దృష్టిలో మా అమ్మ ఓ సూపర్‌ హీరో. నా ప్రతి దశలో, ప్రతి విజయంలో అమ్మ ఉంది. ఒకప్పుడు నేను ఏది అడిగినా కాదూ లేదూ అనకుండా చేసిన మా అమ్మకు ఇప్పుడు నేను గిఫ్ట్‌లూ, సర్‌ప్రైజ్‌లూ ఇస్తున్నందుకు గర్వంగా, ఆనందంగా అనిపిస్తుంటుంది.

క్రీడలంటే ఇష్టం

.

ఒక నటుడిగా ఫిట్‌గా కనిపించేందుకు రోజూ జిమ్‌లో రకరకాల వ్యాయామాలు చేస్తున్నా కూడా నాకు స్పోర్ట్స్‌ అంటే చాలా ఇష్టం. వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌.. వంటివి ఆడుతూ కూడా ఫిట్‌గా ఉండొచ్చనేది నా అభిప్రాయం.

ప్రకృతికి దగ్గరగా

నాకు ఫలానా ప్రాంతమే నచ్చుతుందని లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతికి దగ్గరగా గడిపే అవకాశం వస్తే చాలు ఎన్నిగంటలైనా అక్కడే ఉండిపోతా.. అది ముంబయి, ప్యారిస్‌.. ఏదయినా నాకు ఓకే.

ఇష్టమైన నటి

.

ఒకప్పుడు దీపికా పదుకొణె నటనను ఇష్టపడేవాడిని. ఆలియా భట్‌ చేసిన 'గల్లీబాయ్‌', 'రాజీ' వంటి సినిమాలు చూశాక అబ్బా.. ఎంత బాగా చేస్తోందో అనిపించింది. ఇప్పుడు తన నటనకు వీరాభిమానిని అయిపోయా.

నచ్చే ఆహారం

దమ్‌ బిర్యానీ, బర్గర్లు. ఈ రెండూ ఎదురుగా ఉన్నాయంటే డైటింగ్‌, ఫిట్‌నెస్‌ వంటి విషయాలను పక్కన పెట్టేస్తా. అయితే చాలా పరిమితంగానే తింటాననుకోండీ. అవి లేకపోతే మాత్రం పోషకాహారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా.

ఇష్టమైన సినిమా

టైటానిక్‌, పోకిరి. ఇప్పటివరకూ ఈ రెండు సినిమాలను ఎన్నిసార్లు చూసి ఉంటానో చెప్పలేను.

అభిమానించే నటుడు

.

మహేష్‌బాబు. నేను థియేటర్‌లో చూసిన మహేష్‌బాబు మొదటి సినిమా 'మురారి'. ఇప్పుడంటే మల్టీప్లెక్స్‌లూ, ప్రీబుకింగ్‌లూ వచ్చాయి కానీ.. ఒకప్పుడు మహేష్‌ సినిమా విడుదల అవుతోందంటే.. గంటముందు థియేటర్‌కు వెళ్లినా టికెట్‌ దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. నేను కూడా సినిమా రంగంలోనే ఉన్నా మహేష్‌బాబుకి మాత్రం పెద్ద అభిమానిని.

'పెళ్లిచూపులు' సినిమా విడుదలయ్యాక నా నటనను మెచ్చుకుంటూ మహేష్‌ ట్విట్టర్​లో ఓ మెసేజ్‌ పెట్టాడు. దాన్ని చూసిన రోజు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగిందంటే నమ్మండి.. మహేష్‌ తరువాత నాకు రణ్‌బీర్‌కపూర్‌ నటన నచ్చుతుంది.

ఖరీదైన కార్లు అదో క్రేజు

నాకు ముందునుంచీ కార్లంటే చెప్పలేనంత ఇష్టం. అందుకే వాటిని కొనే అవకాశం వచ్చినప్పుడల్లా ఏ మాత్రం ఆలోచించకుండా తీసేసుకుంటా. అందులో ఫోర్డ్‌ మస్టంగ్‌ ఒకటి. దాదాపు డెబ్బై అయిదు లక్షలు విలువచేసే ఆ కార్లో కూర్చుని వెళ్తుంటే ఆ కిక్కేవేరని ఒకప్పుడు అనుకునేవాడిని. ఆ కారు కొని.. అందులో కూర్చుని రోడ్లమీద దూసుకుపోతున్నప్పుడు మొత్తానికి నేను అనుకున్నది సాధించగలిగాననే ఆనందం నాలో కలిగింది. ఇది కాకుండా మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌సీ క్లాస్‌, బీఎండబ్ల్యూ 5 సిరీస్‌, వోల్వో ఎక్స్‌సి 90, రేంజ్‌రోవర్‌.. వంటివీ నా గ్యారేజ్‌లో ఉంటాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:కరోనాతో చిత్రసీమ ఆగమాగం.. రూ.1500కోట్లు నష్టం!

ABOUT THE AUTHOR

...view details