యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. సినిమాలతోనే కాకుండా తన మాటతీరు, ట్రెండీ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పుడూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. తనకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. విజయ్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఖాళీ సమయంలో తన ఇంట్లో పెంచుకుంటున్న శునకాలతో సరదాగా గడుపుతుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇప్పటికే పలు సందర్భాల్లో అభిమానులతో పంచుకున్నారు. తాజాగా విజయ్ తన పెంపుడు శునకంతో కలిసి తీసుకున్న ఫొటోలను మరోసారి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
స్టైలిష్ లుక్‌లో 'అర్జున్‌రెడ్డి' అదుర్స్.. - vijay devarakonda stills news
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో మైమరిపిస్తున్నారు. తాజాగా మోడ్రన్ దుస్తులు ధరించి తన కుక్కతో కలిసి ఆడుకుంటున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
స్టైలిష్ లుక్‌లో 'అర్జున్‌రెడ్డి' అదుర్స్..
'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత విజయ్ 'ఫైటర్'లో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకుడు. కరణ్ జోహార్ సహ నిర్మాత. బాలీవుడ్ నటి అనన్యా పాండే కథానాయికగా కనువిందు చేయనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందుతోంది.